రాఘవ లారెన్స్, గంగనా రనౌత్ జంటగా నటించిన లేటెస్ట్ సినిమా చంద్రముఖి 2. 2005లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాకి ఇది సీక్వల్ గా వచ్చింది. పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 28న విడుదలైంది. భారీ ఎత్తున విడుదల చేసినప్పటికీ చంద్రముఖి స్థాయిలో చంద్రముఖి 2 ఆకట్టుకోలేకపోయింది అని అంటున్నారు. మొదటి రోజు నుండి మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్స్ సైతం నిరాశపరిచాయి అని అంటున్నారు. అయితే దీని స్పందన చూసి ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు

 డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసింది.  ఇక చంద్రముఖి టూ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫిక్స్ దక్కించుకుంది అని అంటున్నారు. దాదాపుగా ఎనిమిది కోట్ల తో ఓటీటీ రైట్స్ నేట్ఫలిక్స్ కొనుగోలు చేసింది అని తెలుస్తోంది. విడుదల ఎప్పుడు అన్న విషయానికి వస్తే ఈ సినిమా విడుదల అయ్యిన నెల తర్వాత ఓటీటీ లో స్ట్రీమింగ్ చెయ్యాలి అని మొదట ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ థియేటర్స్ లో ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ లభించకపోవడంతో అనుకున్న సమయానికంటే ముందే ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

నవంబర్ మూడవ వారంలో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది అని తెలుస్తుంది. ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే లేదు. సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన వారి విషయానికి వస్తే చంద్రముఖి టు టైటిల్ రోల్ లో నటించిన కంగనా ఇప్పుడు ఆ పాత్ర నుండి బయటకు వచ్చి తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రల్లో నటించిన ఎమర్జెన్సి సినిమా విడుదల కోసం సిద్ధంగా ఉంది. దాంతో పాటు తేజస్ అని సినిమాలో సైతం నటిస్తోంది. 2016లో భారత్ వైమానిక దళంలోకి మొట్టమొదటిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: