ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి ... మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన టైగర్ నాగేశ్వరరావు ... తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా రూపొందిన లియో మూవీ లు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కలపడనున్నాయి. ఇకపోతే ఈ మూడు మూవీ లపై కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. దానితో ఈ మూడు మూవీ లు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కానున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాలు హైదరాబాద్ నగరంలో కూడా భారీ ఎత్తున విడుదల కానున్నాయి. ఇకపోతే ఈ మూడు మూవీ లకు సంబంధించిన టికెట్ ధరలు హైదరాబాద్ నగరంలో ఎలా ఉండనున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం.

బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి మూవీ టికెట్ ధరలు హైదరాబాదు నగరంలో మల్టీ ప్లెక్స్ థియేటర్ లలో 250 రూపాయలు గాను ... సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో 175 రూపాయలు గాను ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన టైగర్ నాగేశ్వరరావు మూవీ టికెట్ ధరలు హైదరాబాద్ నగరంలో మల్టీ ప్లెక్స్ థియేటర్ లలో 200 గాను సింగల్ స్క్రీన్ థియేటర్ లలో 150 రూపాయలు గాను ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

తమిళ హీరో తళపతి విజయ్ హీరోగా రూపొందిన లియో మూవీ టికెట్ ధరలు హైదరాబాద్ నగరంలో మల్టీ ప్లెక్స్ థియేటర్ లలో 295 రూపాయలు గాను ... సింగిల్ స్క్రీన్ థియేట ర్ లలో 175 రూపాయలు గాను ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు వచ్చిన వార్తల ప్రకారం హైదరాబాదు నగరంలో తమిళ డబ్బింగ్ సినిమా అయినటువంటి లియో సినిమాకే ఎక్కువ టికెట్ ధరలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: