క్రిష్ కూడా పవన్ కోసం వేచి చూసి అలిసిపోయి చివరకు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేయడం మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అసలు పవన్ ఈ సినిమాకు ఎప్పుడు డేట్లు ? ఇస్తాడో కూడా తెలియని పరిస్థితి. అప్పటివరకు క్రిష్ తన కెరీర్ పణంగా పెట్టి ఈ సినిమా కోసం ఎదురు చూడలేని పరిస్థితి. అందుకే ఇప్పుడు మరో హీరో గోపీచంద్‌తో ఓ సినిమాను పట్టాలెక్కించాలని క్రిష్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం శ్రీనువైట్ల - గోపీచంద్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అదే జరిగితే ఇప్పటికే ఈ సినిమా ఆలస్యం కావడంతో నిర్మాత ఏఏం.రత్నంపై భారీ భారం పడుతుంది. ఇప్పుడు ఇది మరింత ఎక్కువవుతుందని చెప్పాల్సిందే. ఏదోలా ఈ సినిమాను పూర్తి చేసి త్వరగా రిలీజ్ చేస్తే నిర్మాత వడ్డీల భారం నుంచి గట్టెక్కుతాడు. ఇప్పుడు క్రిష్ మరో సినిమా ప్రారంభిస్తే నిర్మాత మరింత మునిగిపోయే ఛాన్సులే ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి