అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తి గా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మొదటి సినిమా కు జాతీయ అవార్డు రావడం తో పాటు పాన్ ఇండియా స్థాయిలో దాదాపుగా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి, అందుకే రెండో భాగం కి ఏకంగా రూ. 1000 కోట్ల కలెక్షన్స్ వస్తాయి అంటూ చాలా నమ్మకంగా చిత్ర యూనిట్ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరు ఆసక్తి ఎదురు చూస్తున్నారు.కానీ సినిమా ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూ వస్తోంది. రెండు సంవత్సరాలుగా సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం లో సినిమా రాదని తేలి పోయింది.

2024 సంవత్సరం ఆగస్టు లో సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రత్యేకంగా వేసిన సెట్టింగ్లో షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్లో జాతర కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు అనధికారికంగా పేర్కొన్నారు. దర్శకుడు సుకుమార్సినిమా లోని అత్యంత కీలకమైన జాతర షూటింగ్ కి ఏకంగా 15 నుండి 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు అంటూ సమాచారం అందుతుంది.  ఈ బడ్జెట్లో రెండు మూడు మీడియం రేంజ్ సినిమాలు తీసేయవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రూ.

1000 కోట్ల సినిమా కు ఆమాత్రం ఖర్చు పెట్టకుంటే ఎలా అంటూ కొందరు అల్లు అర్జున్ అభిమానులు అభిప్రాయం చేస్తున్నారు. ఈ సినిమా ను హిందీ తో పాటు అన్ని భాషల్లో కూడా కొనుగోలు చేసేందుకు భారీ మొత్తం లో ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా హిందీ మరియు ఇతర భాషలకు సంబంధించిన రైట్స్ కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. అందుకే ఈ సినిమా యొక్క బిజినెస్ రూ. 1000 కోట్ల వరకు అవుతుందని సినీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: