
ఈమధ్య ప్రభాస్ నటించిన చిత్రాలు ఏవి కూడా అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి..దీంతో అభిమానుల సైతం ఫుల్ నిరాశతో ఉన్నారు. అందుకే సలార్ సినిమాపై ఖచ్చితంగా ఈ సినిమా ప్రభావం పడుతుంది అని అభిమానులు తెలుపుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లుగా సమాచారం. రెండు బాగాలుగా ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. మొదటి భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్ 22వ తేదీన క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
సలార్ సినిమా యూఏఎస్ బుకింగ్స్ గురించి తాజాగా ఒక న్యూస్ వైరల్ గా మారు తోంది.నార్త్ అమెరికాలో సలార్ సినిమా బుకింగ్స్ నవంబర్ 20 నుంచి మొదలు కాబోతున్నట్లు తెలియజేశారు. నార్త్ అమెరికాలో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఓపెన్ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ మేరకు ఒక అదిరిపోయే పోస్టర్ని సైతం రిలీజ్ చేశారు. సలార్ సినిమా రికార్డు టికెట్ బుకింగ్ కూడా మొదలయ్యేలా కనిపిస్తూ ఉండడం జరుగుతోంది. దీంతో సలార్ సినిమాకి కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ రావడంతో పాటు..1000 కోట్ల మార్కును కూడా అందుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ ట్విట్ వైరల్ గా మారుతున్నది.