తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి సందీప్ రెడ్డి వంగా తాజాగా యానిమల్ అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. అనిల్ కపూర్మూవీ లో రన్బీర్ కపూర్ కి తండ్రి పాత్రలో నటించాడు. 

ఇకపోతే ఈ మూవీ ఈ రోజు అనగా డిసెంబర్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల కానుంది. ఇకపోతే తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా ఈ చిత్ర బృందం ఈ రోజు విడుదల కానున్న యానిమల్ మూవీ "యూ ఎస్ ఏ" లో ప్రదర్శించ బడుతున్న ఎనిమిది వందల ప్లస్ స్క్రీన్ లలో హనుమాన్ మూవీ టీజర్ ను ప్రసారం చేయనున్నట్లు ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు హనుమాన్ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు పెట్టుకున్నారు. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: