తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో తేజ ఒకరు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం వరుసగా ఎన్నో సినిమాలను తెరకెక్కించి అందులో చాలా మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని అత్యంత తక్కువ కాలం లోనే ఎక్కువ మంది ప్రేక్షకుల ఆదరణను సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన పలు సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యాయి.

 అలాంటి సమయం లోనే ఈయన రానా హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా "నేనే రాజు నేనే మంత్రి" అనే సినిమాకు దర్శకత్వం వహించి సూపర్ హిట్ ను అందుకొని మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత సీత మూవీ ని తెరకెక్కించి తేజ మరో అపజయాన్ని ఎదుర్కొన్నాడు. ఇకపోతే తాజాగా ఈయన దగ్గుపాటి అభిరామ్ హీరోగా "అహింస" అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాని మరికొన్ని రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీలో ప్రసారం చేయనున్నట్లు ఈ ఛానల్ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: