
నిజానికి 2018 ఎన్నికల్లోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అలా జరగకపోతే తాను బ్లేడుతో కోసుకుంటానని అప్పట్లో గణేష్ అనడం సంచలనం సృష్టించింది. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడటంతో అతన్ని దారుణంగా ట్రోల్ చేశారు. బ్లేడ్ గణేష్ అనే పేరు కూడా పెట్టారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో తనను ట్రోల్ చేసిన వారిని లక్ష్యంగా చేసుకుంటూ గణేష్ విమర్శలు గుప్పించాడు.మరోవైపు జడ్పీటీసీగా ప్రస్థానం మొదలు పెట్టి, టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆరేళ్లలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతోపాటు ముఖ్యమంత్రి కాబోతున్నారు రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన.. కేసీఆర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కానున్న రెండో వ్యక్తిగా నిలిచారు.