రీసెంట్ గా 'దసరా తో అందుకున్న నాని మరో రెండు రోజుల్లో 'హాయ్ నాన్న' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిసెంబర్ 7న 'హాయ్ నాన్న' పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. 'దసరా' మూవీతో శ్రీకాంత్ ఓదెలాని పరిచయం చేసిన నాని ఇప్పుడు 'హాయ్ నాన్న' తో శౌర్యువ్ అనే డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు.  మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నాని ఆస్క్ నాని అనే సెషన్ ని నిర్వహించాడు. ఇందులో అభిమానులు, నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.

 సుమారు గంటపాటు సాగిన ఈ సెషన్ లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నాని ఇచ్చిన ఆన్సర్ సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది.' హాయ్ నాన్న మూవీ తో శౌర్యవ్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నారు. అయితే కొత్త డైరెక్టర్లలో మీరు ఎవరితో వర్క్ చేయాలని అనుకుంటున్నారు?' అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు నాని రిప్లై ఇస్తూ.." బలగం డైరెక్టర్ వేణు తో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు" తెలిపాడు. జబర్దస్త్ షో తో కమెడియన్ గా పేరు తెచ్చుకున్న వేణు'బలగం' మూవీతో దర్శకుడిగా మారి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్ షిప్స్ ని ఎంతో హార్ట్ టచింగ్ గా చూపించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. 

ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అలాంటి వేణుతో నాచురల్ స్టార్ నాని మూవీ చేస్తే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందంటూ అభిమానులు చెబుతున్నారు. ఒకవేళ నానితో వేణు సినిమా తీస్తే అది ఎలాంటి జోనర్ లో ఉంటుందో చూడాలని అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూడటం ఖాయం అని చెప్పొచ్చు. మరి  వేణు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఇక బలగం తో భారీ హిట్ అందుకున్న వేణు ప్రస్తుతం తన రెండో సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. తన రెండవ ప్రాజెక్ట్ ని కూడా దిల్ రాజు ప్రొడక్షన్లోనే చేయబోతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: