
శ్రీమంతుడు సినిమా స్టోరీ కాపీ అంటూ సరికొత్త వివాదం తెరపైకి రావడం జరిగింది. అయితే శ్రీమంతుడు సినిమా విడుదల సమయంలో శరత్ చంద్ర అనే ఒక రైటర్ కొరటాల శివ పైన కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. దీన్ని తీర్పు ఇప్పుడు రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది శ్రీమంతుడు సినిమా 2015లో విడుదల చేయడం జరిగింది ఆ సమయంలో.. ఈ సినిమా కథ వేమూరి బలరాం నేతృత్వంలో స్వాతి మాస పత్రికలో చచ్చేంత ప్రేమ అనే నవల ఆధారంగా ఈ సినిమా తీశారని రైటర్ శరత్ చంద్ర ఆరోపించడం జరిగింది.
1729/2017 సెక్షన్ కింద కేసుని నమోదు చేయగా ఈ కేసు కొట్టేయాలంటూ మహేష్ బాబు, నవీన్, కొరటాల శివ హైకోర్టును సైతం ఆశ్రయించారు. డైరెక్టర్ కొరటాల శివ పైన ఈ కాపీ రైట్స్ చట్టం కింద క్రిమినల్ కేసును కూడా నమోదు చేశారట.తాజాగా హైకోర్టు తమ తీర్పుని తెలియజేయడం జరిగింది.. దీంతో డైరెక్టర్ కొరటాల శివ ఈ కేసును ఎదుర్కోవడం అనివార్యం కావడంతో శరత్ చంద్ర తరుపున కేసుని ప్రముఖ న్యాయవాది చల్ల అజయ్ రాజశేఖర్ వాదించడం గమనార్హం.
శృతిహాసన్ మహేష్ బాబు జంటగా నటించిన శ్రీమంతుడు సినిమా 2015 ఆగస్టు 7న విడుదల అయింది. మరి ఈ కేస్ ఎంతవరకు వెళుతుందో చూడాలి మరి.