జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా కంటెస్టెంట్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి తన కామెడీతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే కేవలం బుల్లితెర తోనే కెరీర్ కు ఫులి స్థాప్ పెట్టకుండా వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఒకప్పుడు ఇతర హీరోల సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఆకట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఇక ఇప్పుడు హీరోగా కూడా రాణిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.


 గాలోడు అనే సినిమాతో సుడిగాలి సుదీర్ కమర్షియల్ విజయం కూడా సొంతం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగానే ఉన్నాడు. అయితే ఈ జబర్దస్త్ కమెడియన్ ఒక క్రేజీ ఆఫర్ ను మిస్ చేసుకున్నాడు అంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా మెగా కోడలతో నటించే అవకాశాన్ని చేర్జార్చుకున్నాడట. వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుని మెగా కోడలుగా మారిపోయిన లావణ్య త్రిపాఠి ఇటీవలే వెబ్ సిరీస్ లో మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది అని చెప్పాలి.


 ఈ మూవీలో లావణ్య త్రిపాఠి ఒసిడి కలిగిన అమ్మాయిగా నటించి మెప్పించింది. అయితే ఇక ఈ సిరీస్ కి మంచి రెస్పాన్స్ రాగా.. లావణ్య త్రిపాఠి నటనకు పై కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు విశ్లేషకులు. అయితే ఈ వెబ్ సిరీస్ లో బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కీలకపాత్రలో నటించాడు. అయితే మొదటగా అభిజిత్ స్థానంలో సుడిగాలి సుదీర్ ని తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారట. అయితే అప్పటికే వరుణ్ లావణ్య ప్రేమాయణం గురుంచి వార్తలు వచ్చాయి. దీనిపై ఎంక్వైరీ చేసిన సుధీర్ నిజం అది తెలియటంతో ఇక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. ఎందుకంటే నాగబాబునే సుదీర్ కి లైఫ్ ఇచ్చారు. అంతేకాదు నాగబాబు ను.. నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటారు సుధీర్. అలాంటిది ఆ ఇంటి కోడలతో నటించటం సమాజం కాదు అని సుదీర్ అనుకొని ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. మరి ఇందులో ఎంత నిజం ఉంది అన్నది మాత్రం తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: