నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ నిర్మాతగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న డీ వి వి దానయ్య ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. 

మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన రెండవ షెడ్యూల్ షూటింగ్ ను ఈ రోజుతో ముగిసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే గతంలో నాని మరియు వివేక్ కాంబోలో అంటే సుందరానికి అనే మూవీ రూపొందింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను రాబట్ట లేకపోయిన విమర్శకుల నుండి మాత్రం మంచి ప్రశంసలు అందుకుంది. ఇలా అంటే సుందరానికి మూవీ తర్వాత విరి కాంబో లో రూపొందిన రెండవ సినిమా కావడంతో సరిపోదా శనివారం సినిమాపై కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే నాని ఆఖరుగా హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించి మంచి విజయాన్ని అనుకున్నాడు. మరి సరిపోతా శనివారం మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: