ఆ తర్వాత కొంతకాలం పాటు తమిళంలో అడపా దడపా సినిమాల్లో కనిపించింది హన్సిక. 2022లో సోహైల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె నటనకు విరామం ప్రకటించలేదు. ఎం వై త్రీ, మై నేమ్ ఇస్ శృతి అనే ఓ వెబ్ సిరీస్ లలో నటించి అలరించింది.. సినిమా అవకాశాలు రాకపోతుండడంతో ప్రస్తుతం హన్సిక వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది..ఇక ఇటీవల హన్సిక తన అందమైన ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేసింది.. సోషల్ మీడియాలో హన్సిక యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవల స్ట్రీమింగ్ అవుతున్న మై నేమ్ ఇస్ శృతి అనే వెబ్ సిరీస్ ప్రచారంలో భాగంగా ఆమె ఫోటోషూట్ నిర్వహించింది. గతంలో బొద్దుగా ఉన్న హన్సిక.. ఇప్పుడు సన్నగా మారడంతో మరింత అందంగా కనిపిస్తోంది. దానికి తోడు పొట్టి గౌను ధరించడంతో కొంటెగా దర్శనమిస్తోంది. ప్రస్తుతం హన్సిక ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి