శివరాత్రి సినిమాల హడావిడి వీకెండ్ తో ముగిసిపోయింది. ‘గామి’ మొదటి మూడు రోజులు కలక్షన్స్ పరంగా బాగానే ఉండటంతో బ్రేక్ ఈవెన్ వచ్చినప్పటికీ సోమవారం నుండి ఈ మూవీ కలక్షన్స్ బాగా డ్రాప్ అయినట్లు వార్తాలు వస్తున్నాయి. గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన ‘భీమా’ పరిస్థితి కూడ కలక్షన్స్ పరంగా ఏమాత్రం ఆశాజనకంగా లేదు అన్నవార్తలు వస్తున్నాయి.ఇక కార్తికేయ నిర్మాతగా  రాణించాలని ‘ప్రేమలు’ మూవీతో చేసిన ప్రయత్నం కూడ ఫెయిల్ అయినట్లు సంకేతాలు వస్తున్నాయి. దీనితో ‘శివరాత్రి’ కి విడుదలైన మూడు సినిమాలు ప్రేక్షకులను మెప్పించ లేకపోయాయి అన్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులను లెక్కచేయకుండా ఈవారం కూడ చిన్న సినిమాల జాతర భారీ ఎత్తున జరగబోతోంది. దీనితో ఈవారం విజేత ఎవరు అన్న చర్చలు ఇండస్ట్రీ వర్గాలలో జరగబోతున్నాయి.ఈ శుక్రువారం 7 చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. పూరీ జగన్నాథ్ తమ్ముడు నటించిన ‘వెయ్ దరువెయ్’ మూవీకి పబ్లిసిటీ బాగా చేస్తున్నారు. వివాదాలు రేపుతున్న ‘రజాకార్’ మూవీలో ఊహించని సంచలనం ఏదైనా ఉంటుందా అన్న సందేహాలు వస్తున్నాయి. అనసూయ బాబి సింహా లాంటి పేరున్న నటీనటులు ఈమూవీలో నటిస్తున్నారు. అనన్య నాగళ్ళ ప్రధానపాత్రలో నటించిన ‘తంత్ర’ హారర్ మూవీ పై కూడ ఇండస్ట్రీ వర్గాలలో ఆశక్తి ఉంది.చైతన్య రావు హీరోగా నటించిన ‘షరతులు వరిస్తాయి’ కంటెంట్ పరంగా డిఫరెంట్ సినిమా అంటున్నారు. త్రిగున్ నటించిన ‘లైన్ మ్యాన్’ కాన్సెప్ట్ పరంగా వెరైటీ సినిమా అంటున్నారు. ఈచిన్న సినిమాతో పాటు ‘రవికుల రఘురామ’తో పాటు బిగ్ బాస్ ఫేమ్ దివి ‘లంబసింగి’ కూడ ఈవారమే రాబోతున్నాయి. ఈవారమే బాలీవుడ్ మూవీ ‘యోధ’ విడుదల కాబోతోంది. సిద్దార్థ్ మల్హోతా రాశి ఖన్నా లు ఈ మూవీలో నటిస్తున్నారు. ఇన్ని చిన్న సినిమాల మధ్య ఈవారం విజేత ఎవరు అంటూ అప్పుడే చర్చలు మొదలైపోవడంతో ఆశక్తి ఇండస్ట్రి వర్గాలలో బాగా కనిపిస్తోంది..  

..మరింత సమాచారం తెలుసుకోండి: