తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి శర్వానంద్ ఆఖరుగా "ఒకే ఒక జీవితం" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కంటే ముందు వరుసగా అనేక ఆపజాయలను ఎదుర్కొన్న శర్వా ఈ మూవీ విజయంతో తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. ఇక ప్రస్తుతం శర్వా "మనమే" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీరామ్ ఆదిత్య ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 

ఇకపోతే ఈ మూవీ కి ఖుషి ... హాయ్ నాన్న సినిమాలకు సంగీతం అందించి ఈ రెండు మూవీ ఆల్బమ్ లతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వశిం అబ్దుల్ వహెబ్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలోని మొదటి సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ లోని మొదటి సాంగ్ అయినటువంటి "ఇక నా మాటే" అంటూ సాగబోయే పాటను మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే శర్వా ప్రస్తుతం ఈ మూవీ తో పాటు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఓ మూవీ లోను నటిస్తున్నాడు. "సమజవరగమన" లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించబోయే మూవీ కావడం అందులో శర్వా హీరో గా నటించనుండడంతో ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: