తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన యువ హీరోలలో నిఖిల్ ఒకరు. ఈయన ప్రస్తుతం స్వయంభు అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఠాగూర్ మధు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. 

ఇకపోతే ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని నబా నటేశ్ కనిపించబోతున్నట్లు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో ఈ బ్యూటీ పాల్గొన్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా లోని సెకండ్ హీరోయిన్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో నాబా నటేష్ కూడా హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఈ ముద్దు గుమ్మకు సంబంధించిన ఈ మూవీ లోని ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ వరస సినిమాల్లో నటిస్తున్న సమయం లోనే కాలికి చిన్న యాక్సిడెంట్ కావడంతో ఈమె కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇక ప్రస్తుతం ఈమె వరుస సినిమాలను ఓకే చేస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: