తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన యువ నటీమణులలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈమె ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా ... సితార ఎంటర్టైన్మెంట్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. 

ఇకపోతే ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో మాత్రమే కాకుండా భారీ స్థాయిలో అందాలను కూడా ఆరబోసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కూడా అయింది. ఈ మూవీ తో అనుపమ క్రేజ్ తెలుగు లో మరింతగా పెరిగింది. ఇకపోతే తాజాగా అనుపమ కు సంబంధించిన కొత్త సినిమా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. తాజాగా అనుపమ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా టైటిల్ పోస్టర్ ను చిత్ర బృందం వారు విడుదల చేశారు. అనుపమ నటిస్తున్న సినిమాకు పరదా అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు.

ఇందులో అనుపమ చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉంది. ఇక ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునేలా ఉండడంతో పోస్టర్ తోనే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇకపోతే ఈ సినిమాకు "సినిమా బండి" మూవీ కి దర్శకత్వం వహించిన ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసిన ఈ సినిమా అనుపమ కెరియర్ లో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: