వరలక్ష్మీ శరత్ కుమార్ నటనలో విలనిజం తెలుగులో సూపర్ హిట్. 'క్రాక్', 'యశోద', 'వీర సింహా రెడ్డి', 'కోట బొమ్మాళీ పీఎస్'లో విలన్ రోల్స్ చేసి విజయాలు అందుకున్నారు.'హనుమాన్'లో హీరోకి అక్కగా పాన్ ఇండియా సక్సెస్ కొట్టారు. బట్, ఫర్ ఏ ఛేంజ్... తెలుగులో తొలిసారి వరలక్ష్మీ శరత్ కుమార్ ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ 'శబరి' చేశారు. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల ప్రొడ్యూస్ చిత్రమిది. దర్శకుడిగా అనిల్ కాట్జ్ మొదటి సినిమా. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ఎలా ఉందో రివ్యూలో చూడండి.వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి , వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు ఈ సినిమా లో నటించారు.వరలక్ష్మీ శరత్ కుమార్ ఫస్ట్ టైమ్ తెలుగులో ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ చేయడం, మదర్ అండ్ డాటర్ ఎమోషన్ మూవీ కావడంతో 'శబరి' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి, సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే...సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన సినిమా 'శబరి'. అయితే... ఆ థ్రిల్ ఫ్యాక్టర్ ప్రీ ఇంటర్వెల్ వరకు ప్రారంభం కాలేదు. సిటీలో ఓ మెంటల్ ఆశైలం నుంచి ఒక వ్యక్తి తప్పించుకోవడం, ఇద్దరిని చంపి తల్లీ కుమార్తె కోసం మొదలుపెట్టే అన్వేషణతో సినిమాను ఆసక్తిగా ప్రారంభించాడు దర్శకుడు అనిల్ కాట్జ్. తర్వాత వరలక్ష్మితో మైమ్ గోపి ఫేస్ టు ఫేస్ సీన్స్, థ్రిల్ ఫ్యాక్టర్ కోసం ప్రీ ఇంటర్వెల్ వరకు వెయిట్ చేసేలా చేశాడు. అందువల్ల, అప్పటి వరకు సినిమా నిదానంగా ముందుకు వెళుతుంది.

వరలక్ష్మి క్యారెక్టర్ బాల్యం, తల్లితో అనుబంధం... సవతి తల్లితో గొడవ, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు దూరం కావడానికి కారణం... ప్రీ ఇంటర్వెల్ వరకు థ్రిల్ కంటే ఎమోషనల్ డ్రామా ఎక్కువ నడిచింది. పరుగులు పెట్టాల్సిన కథనం చాలా నిదానంగా ముందుకు సాగింది. దాంతో మెరుపులు ఏం లేవు. ఇంటర్వెల్ ముందు ఒక్కసారిగా కథలో వేగం మొదలైంది. ఆ తర్వాత మళ్లీ కాస్త నెమ్మదించినా చివరకు పరుగులు పెట్టింది. మధ్యలో 'వన్ నేనొక్కడినే' గుర్తుకొస్తుంది. లాజిక్స్ విషయంలో దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. గోపీసుందర్ పాటలు కథతో పాటు ఫ్లోలో వెళ్లాయి. మళ్లీ వినేలా, గుర్తుంచుకునేలా లేవు. థ్రిల్లర్ సన్నివేశాలకు నేపథ్య సంగీతం చక్కగా చేశారు. ఈ మూవీ నిడివి తక్కువే. ఇంకాస్త ట్రిమ్ చేయవచ్చు. ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు పర్వాలేదు.శబరి... తెలుగులో వస్తున్న సినిమాలతో కంపేర్ చేస్తే ఒక డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్! ఎమోషనల్ టచ్ ఉన్న కాన్సెప్ట్! అయితే... ఫస్టాఫ్ స్లోగా వెళుతుంది. ఆ తర్వాత డిఫరెంట్ టర్న్స్ తీసుకుంటూ ముందుకు వెళుతుంది. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళ్ళండి. కొత్త వరలక్ష్మిని చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: