డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఎప్పుడు వివాదాస్పద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అతని దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా అర్జున్ రెడ్డి టాలీవుడ్ లో ఇలాగే వివాదాలను ఎదుర్కొంది. ఎన్నో విమర్శలు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత ఇదే సినిమాని కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేసి అక్కడ హిట్టు కొట్టాడు. అయితే ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ అనే మూవీ తీశాడు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఈ సినిమాపై ఎంతల విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా మహిళలను తక్కువ చేసి చూపించారు అంటూ కొంతమంది.. వైలెన్స్ ఎక్కువగా ఉంది అంటూ ఇంకొంతమంది.. మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ మరికొంతమంది ఇక ఈ సినిమాపై విమర్శలు చేశారు. ఈ సినిమాలు ఆపేయాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే ఇలాంటి విమర్శలను దాటుకుంటూ వచ్చిన యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. దీంతో విమర్శల నడుమ బ్లాక్ బస్టర్ కావడంతో చాలా మంది సినీ ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. అయితే యానిమల్ మూవీ ఇలా బ్లాక్ బస్టర్ కావడానికి గల కారణాన్ని నటుడు మనోజ్ బాజ్పేయి చెప్పుకొచ్చాడు.


 చాలామంది వ్యక్తులు ఏకీభవించక పోయిన నేను ఈ విషయంలో స్పష్టంగా ఉన్నాను. ట్రైలర్ ఆధారంగా సినిమా నచ్చితే చూడాలి. లేదంటే వదిలేయాలి. అంతేకానీ దాన్ని విమర్శించకూడదు. ఎందుకంటే అది పూర్తిగా వ్యాపారం. మనం సినిమాకు ఇబ్బంది సృష్టిస్తే. దానిపై ఆధారపడి ఉన్న ఎంతోమందిపై అది ప్రభావం చూపుతుంది. సినిమాలపై విమర్శలు వచ్చిన అవి బ్లాక్ బస్టర్గా నిలుస్తాయి. యానిమల్ విడుదలైన తర్వాత దాన్ని ఎంతో మంది విమర్శించారు. అయిన ఆ సినిమా భారీ స్థాయిలో వసూళ్లు చేసింది. 2023 హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇక విమర్శించిన కంటెంట్ అందులో ఉందో లేదో చూడటానికి ప్రేక్షకులు వెళ్లారేమో. అందుకే ఆ సినిమా హిట్ అయి ఉండవచ్చు అంటూ చమత్కరించారు మనోజ్ బాజ్పేయి. ఇక దక్షిణాది భాషల్లో విడుదలైన ఎన్నో సినిమాలు నాకు నచ్చాయి. కాంతర కాన్సెప్ట్ నన్ను ఆకర్షించింది. ఇక త్రిబుల్ ఆర్ సినిమా మన స్థాయిని పెంచింది. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న యానిమల్ నాకు వినోదాత్మకంగా అనిపించింది అంటూ మనోజ్ బాజ్పేయి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: