తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సేతుపతి తాజాగా నటించిన థ్రిల్లర్ మూవీ మహారాజా. ఇటీవలే విడుదలైంది ఈ సూపర్ హిట్ మూవీ.విడుదల కాక ముందే ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్లుతో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకోవడం జరిగింది.ప్రేక్షకులు పెట్టుకున్న భారీ అంచనాలను అందుకోవడంలో మహారాజా మూవీ 100 పర్సెంట్ విజయం సాధించింది. తొలిరోజే ఈ మూవీకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకులు ఈ మూవీని చూసేందుకు ఎంతగానో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కూడా సూపర్ గా అదరగొడుతుంది.ఇప్పటికీ ఈ సినిమా విడుదలై మొత్తం మూడు రోజులు అవుతున్నప్పటికీ బుక్ మై షో లో జోరుగా టికెట్స్ ను కొనుగోలు చేస్తున్నారు ఆడియన్స్. మహారాజా మూవీ మూడవరోజు ఏకంగా..207 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ని నమోదు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.


దీంతో ఈ సినిమా నిర్మాతలకి కాసుల వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. సినిమాకి మంచి టాక్ అందడంతో ఈ మూవీ లాంగ్ రన్ లో కూడా మరిన్ని బుకింగ్స్ ని నమోదు చేసి భారీగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని స్పష్టంగా అర్ధం అవుతుంది.నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన ఈ మహారాజా సినిమా తెలుగు వెర్షన్ జూన్ 14, 2024న విడుదల అయ్యింది.ఈ మూవీని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో NVR సినిమాస్ విడుదల చేసింది.  ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద విడుదలైన తొలి వారం 32.6 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసినట్లు సమాచారం తెలుస్తుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఒక్క తమిళనాడులో కాకుండా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో కూడా దూసుకుపోతుంది.ఈ మూవీలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్ కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీకి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనున్నారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ ఇంకా థింక్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: