కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్‌  ప్రస్తుతం వెంకట్ ప్రభు  దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే సినిమా చేస్తున్నాడని తెలిసిందే. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో డైరెక్టర్ వెంకట్ ప్రభు చాలా సర్ ప్రైజ్లు ఇస్తున్నాడని సమాచారం తెలుస్తుంది. అలాగే కొన్ని షాకులు కూడా ఇస్తున్నాడు. తన సినిమాలన్నిటీలో పెట్టిన కాస్ట్ నే మళ్ళీ మళ్ళీ బోర్ కొట్టిస్తాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలో మళ్ళీ ఇంకో బోరింగ్ ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాడు. అదే కాజల్ అగర్వాల్ కామియో. ఆమెను తెలుగు ప్రజలే మరిచిపోయారు. ఇక తమిళ ప్రజలు గుర్తు పెట్టుకుంటారా అనే కామెంట్స్ వస్తున్నాయి. అసలు కాజల్ అవసరం ఎందుకు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి చూడాలి డైరెక్టర్ సార్ ఏం ప్లాన్ చేసాడో.. ఇక మరోవైపు టాలెంటెడ్ స్టార్ కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో దళపతి 69కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్‌. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో బాగా చక్కర్లు కొడుతోంది.ఈ మూవీ కోసం విజయ్‌ తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది. 


తాజాగా తెలుస్తున్న వార్తల ప్రకారం దళపతి 69 కోసం విజయ్‌ ఏకంగా రూ. 275 కోట్లు (+జీఎస్టీ) తీసుకుంటున్నాడని ఇన్‌సైడ్‌ టాక్‌. ఈ ఫిగర్‌తో భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా విజయ్ వార్తల్లోకి ఎక్కాడు విజయ్‌. ఇక తమ హీరో స్టార్‌డమ్‌, క్రేజ్‌ చూసి ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు విజయ్ అభిమానులు.ఈ మూవీని పాపులర్ ప్రొడక్షన్‌ హౌజ్‌ సన్ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మించనున్నారు. ఇక గత సంవత్సరం జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌ సినిమాతో సూపర్ హిట్టందుకున్న కార్తీక్ సుబ్బరాజు విజయ్‌ను ఎలా చూపించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.అయితే విజయ్ ఇంత భారీ మొత్తం రెమ్యూనరేషన్ తీసుకోడానికి ఓ బలమైన కారణం కూడా ఉంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే పార్టీ కూడా పెట్టేసాడు. అందుకే ఆ పార్టీ కోసం డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఇక విజయ్ ADMK పార్టీతో చేతులు కలపనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: