పూరీ క్రేజీ మల్టీస్టారర్.. హీరోలు ఎవరంటే?పోకిరి లాంటి ఎపిక్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ కెరీర్ లో కాస్త వెనకపడే సరికి పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. అందుకే విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేసిన పూరీ జగన్నాథ్ ఆ సినిమా సక్సెస్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ అది డిజాస్టర్ అవ్వడం వల్ల పూరీకి అవకాశాలనేవి రాలేదు.సరిగ్గా అలాంటి టైం లో పూరీతో మరోసారి కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చాడు రాం పోతినేని. వీరు ఇద్దరు గతంలో కలిసి చేసిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కి డబుల్ ఇస్మార్ట్ సినిమా చేశారు.ఆగష్టు 15న డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ ని లాక్ చేశారు.పూరీ మార్క్ టేకింగ్ తో రామ్ అదరగొట్టే యాక్టింగ్ తో పాటుగా మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అందరు మెచ్చేలా డబుల్ ఇస్మార్ట్ జాగ్రత్తగా తెరకెక్కిచ్చాడట పూరీ.ఇంకా అంతేకాదు డబుల్ ఇస్మార్ట్ సినిమా హిట్ అయితే మాత్రం పూరీ నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం తెలుస్తుంది. ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా పూరీ టేకింగ్ గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. 


పూరీ సినిమాలు ఫెయిల్ అవ్వొచ్చు కానీ దర్శకుడిగా టేకింగ్ లో మాత్రం పూరీ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు.అందుకే డబుల్ ఇస్మార్ట్ సినిమా తర్వాత పూరీ ఒక భారీ మల్టీస్టారర్ సినిమాని ప్లాన్ చేస్తున్నాడట. rrr మూవీలో ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ నటించారు. ఇప్పుడు వార్ 2 మూవీలో హృతి రోషన్, ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. అలా  పూరీ జగన్నాథ్ ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ మల్టీస్టారర్ తెలుగు హీరో ఒకరు హిందీ హీరో మరొకరని తెలుస్తుంది.ఐతే ఆ హీరోలు ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. పూరికి గతంలో అమితాబ్ బచ్చన్ తో కూడా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి పూరీ సినిమా అంటే బాలీవుడ్ నటులు కూడా ఆసక్తిగా ఉంటారు. సో ఈ మల్టీస్టారర్ తెర మీదకు రావాలంటే మాత్రం ఖచ్చితంగా డబుల్ ఇస్మార్ట్ సినిమా హిట్ అవ్వాల్సిందే. అందుకే పూరీ డబుల్ ఇస్మార్ట్ ని ఎక్కడ టార్గెట్ మిస్ అవ్వకుండా ఫోకస్ తో పనిచేస్తున్నారని సమాచారం తెలుస్తుంది. రామ్ కూడా డబుల్ ఇస్మార్ట్ తో పాన్ ఇండియా రేంజ్ లో విధ్వంస సృష్టించడం పక్కా అని బలంగా నమ్ముతున్నాడు. మరి సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: