కెరియర్ తొలినాళ్ళ నుంచి అతను అందరిలా రొటీన్ సినిమాలను కాకుండా ఏకంగా వైవిధ్యమైన సినిమాలను చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇలా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేసుకుంటూ వచ్చాడు. ఇక గత కొంతకాలం నుంచి వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో సాహసం చేసేందుకు రెడీ అయ్యాడు. ఆ హీరో ఎవరో కాదు శ్రీ విష్ణు.


 ఇతగాడు అతని కెరియర్లో చేసిన పాత్రలు చూస్తే ఇక అతను ఎంత సాహసాలు చేస్తూ కెరియర్ను సాగించాడో అందరికీ అర్థమవుతుంది  ఈ క్రమంలోనే అద్భుతమైన కథలను ఎంచుకోవడంలో అతను దిట్ట అని చెప్పాలి  ఇక ఇటీవలే ఒక పాత్ర కోసం ఆ హీరో డెడికేషన్ చూసి ఫాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. అతడి ఓపికకి కథపై అతనికి ఉన్న నమ్మకాన్ని చూసి పొగడ్తలు కురిపిస్తున్నారు. పైన ఫోటోను చూశారా ముసలివాడిగా కనిపించేందుకు మేకప్ వేసుకుంటున్న ఆ హీరో ఎవరో కాదు అతను యంగ్ హీరో శ్రీ విష్ణు.


 గత ఏడాది సామజ వరగమనతో అలరించిన ఈ హీరో.. ఇక ఇటీవల ఓం బీమ్ బుష్ తొ సందడి చేశాడు. ఇక రాహుల్ రామకృష్ణ ప్రియదర్శితో కలిసి కడుపుబ్బ నవ్వించాడు. ఇక ఇప్పుడు స్వాగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు  రాజరాజ చోరా డైరెక్టర్ హసిత్కోలి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ మూవీలో శ్రీ విష్ణు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయ్. ఇందులో శ్రీ విష్ణు ఏకంగా ముసలివాడిలా కనిపించేందుకు నాలుగు గంటల పాటు మేకప్ వేసుకుంటున్నాడట. దివాకర్ పేట ఎస్సై భవభూతి రోల్ లో అదరగొట్టాడు శ్రీ విష్ణు. అయితే ఈ పాత్ర మేకోవర్ కు  సంబంధించిన వీడియో పైరల్ గా మారింది. నాలుగు గంటల పాటు మేకప్ వేసుకుంటూన్న శ్రీ విష్ణుని చూసి అందరు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: