రెబల్ స్టార్ ప్రభాస్ పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో సలార్ మొదటి భాగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. సలార్ మూవీ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న ప్రభాస్ తాజాగా కల్కి 2898 ఏ డి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అమితా బచ్చన్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. అలాగే దీపికా పదుకొనే , దిశ పాటని కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ లో కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించాడు. ఈ మూవీ జూన్ 27 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు ట్రైలర్లను విడుదల చేసింది. ఈ రెండు ట్రైలర్లకి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన రెండవ ట్రైలర్ కు 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ మూవీ సెకండ్ ట్రైలర్ తెలుగు వర్షన్ కి 24 గంటలు ముగిసే సరికి 12.03 మిలియన్ వ్యూస్ ... 485.7 కే లైక్స్ లభించాయి.

ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా రెండవ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. కాకపోతే ఈ సినిమా నుండి విడుదల చేసిన మొదటి ట్రైలర్ కు ఇంతకంటే ఎక్కువ రెస్పాన్స్ 24 గంటల సమయంలో ప్రేక్షకుల నుండి లభించింది. ప్రస్తుతానికి ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని భారీ స్థాయి విజయాన్ని అందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: