పుష్ప-2 ఇంకా ముప్పై రోజుల షూటింగ్ పూర్తి చేయాల్సివుంది. ప్రస్తుతం చిత్రీకరణ కొంత గ్యాప్ ఇచ్చారు. ఈ నెలాఖరులో చిత్రీకరణ మళ్లీ షూరూ కాబోతుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఫాద్ ఫాసిల్ డేట్స్ కోసమే పుష్ప-2 యూనిట్ ఎదురుచూస్తున్నట్లు సమాచారం. సో.. ఈ నెలాఖరులో పహద్ ఫాజిల్ డేట్స్‌ను బట్టి పుష్ప-2 చిత్రీకరణ మళ్లీ షూరూ కాబోతుంది. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుకుగా కొనసాగుతున్నాయి. అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 1000 కోట్ల బిజినెస్‌ను పుష్ప-2 పూర్తిచేసిందని అంటున్నాయి చిత్రవర్గాలు.ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో ఎర్రచందనం స్మగ్లర్ గా మాస్ లుక్ లో తన నటనను అదరగొట్టాడు. అల్లు అర్జున్ కు 69 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో` పుష్ప-ది రైజ్ `లో తన నటనకు ఉత్తమ నటుడు అవార్డు ను గెలుచుకున్నాడు అలాగే ఉత్తమ సంగీతం అవార్డ్ దేవీ శ్రీ ప్రసాద్ కి దక్కింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి