కొంతమంది హీరోయిన్లు మాత్రం ఇక తమ కండిషన్స్ ని ఎక్కడ బ్రేక్ చేయకుండా కెరియర్ను కొనసాగిస్తున్నారు. అవకాశాలు వచ్చిన రాకుండా తాము మాత్రం కండిషన్స్ బ్రేక్ చేసేది లేదు అంటూ చెప్పేస్తున్నారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. అతిలోకసుందరి, దివంగత నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వి కపూర్ ఇప్పటికే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తోంది. అయితే ఇక ఇప్పుడు తెలుగులో కూడా అలరించేందుకు సిద్ధమైంద. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర అనే మూవీలో నటిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే.
అయితే బోల్డ్ పాత్రల్లో సైతం నటించేందుకు సిద్ధమయ్యే జాన్వి కపూర్ సినిమా కోసం తాను ఒక్క పని మాత్రం చేయను అంటూ చెబుతుంది. సినిమాలో తన పాత్ర కోసం ఎంత కష్టమైనా భరిస్తాను. కానీ జుట్టు మాత్రం కత్తిరించను అంటూ హీరోయిన్ జాన్వి కపూర్ తెలిపింది. నా కెరియర్ను మలుపు తిప్పే రోల్ అయినా సరే గుండు చేయించను. విఎఫ్ ఎక్స్ లో మేనేజ్ చేస్తామంటేనే ఓకే చెబుతాను. దీనికి కారణం మా అమ్మ శ్రీదేవి. ఆమెకు నా హెయిర్ అంటే ఎంతో ఇష్టం. ధడక్ మూవీ సమయంలో హెయిర్ కట్ చేస్తే ఆమె తిట్టింది. ఏ పాత్ర కోసమైనా జుట్టు మాత్రం కత్తిరించుకోవద్దని తెలిపింది అంటూ ఉలజ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జాహ్నవి కపూర్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.