సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత పెద్ద కెరియర్ హీరోయిన్లకు ఉండదు. దానితో కొంత మంది హీరోయిన్లు కెరియర్ ప్రారంభించిన కొత్తలో కాస్త క్రేజ్ రాగానే వరుస సినిమాలలో నటిస్తూ వస్తారు. ఇక అలా నటించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించినట్లు అయితే వారి కెరియర్ పిక్స్ లోకి వెళ్ళిపోతుంది. అలా నటించిన సినిమాలు కనక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడితే వారు కొన్ని సంవత్సరాలకే ఇండస్ట్రీ లో కనబడకుండా పోతారు. ఇకపోతే హీరోలకు సమాన స్థాయిలో కెరియర్ ను కొనసాగించిన బ్యూటీలలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు.

ఈమె చాలా సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె హ్యాపీ డేస్ మూవీ తో మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించింది. ఆ సినిమాలలో చాలా మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో చాలా తక్కువ కాలంలోనే ఈమె స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. ఇక ఇప్పటికి కూడా ఈమె తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే ఐటమ్ సాంగ్ లు చేయడంలో మాత్రం తమన్నా ఫుల్ జోష్ ను చూపిస్తోంది. ఇప్పటికే ఈమె చాలా సినిమాలలో ఐటమ్ పాటలలో ఆడి పాడింది. కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా ఈమె ఐటమ్ సాంగ్స్ చేసింది. దాదాపు ఈమెతో పాటు కెరియర్ ను మొదలు పెట్టి స్టార్ హీరోయిన్ల స్థాయికి వెళ్లిన చాలా మంది హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేసినా కూడా తమన్నా స్థాయిలో వారు సక్సెస్ కాలేదు. ఇలా ఇప్పటికి కూడా తమన్నా ఐటమ్ సాంగ్ లలో నటిస్తూ కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: