మాధవి అసలు పేరు విజయలక్ష్మి. ఎక్కువగా మాధవి, చిరంజీవి కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఖైదీ ప్రాణం ఖరీదు, ఉరికిచ్చిన మాట, చట్టానికి కళ్ళు లేవు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, చట్టంతో పోరాటం, సింహపురి సింహం, బిగ్ బాస్, దొంగ మొగుడు వంటి సినిమాల్లో వీరిద్దరూ కలిసి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇవన్నీ సినిమాలు ఒకటైతే మాతృదేవోభవ సినిమా ఒకటి. మాధవి కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా మాతృదేవోభవ సినిమా నిలిచింది.
ఈ బ్యూటీ చాలాకాలం క్రితం సినిమాలకు దూరమైంది. 1996లోనే వివాహం చేసుకొని అమెరికాలో తన భర్తతో సెటిల్ అయింది. ఆమె భర్త రాల్ఫ్ శర్మ యూఎస్ లో ఫార్మా కంపెనీ అధినేతగా వ్యాపారంలో రాణిస్తున్నారు. మాధవి కూడా వ్యాపారంలో తన భర్తకి సహాయం చేస్తుంది. వీరికి ముగ్గురు పిల్లలు. పెళ్లికి ముందే మాధవి తన భర్తకి ఓ కండిషన్ పెట్టిందట. అదేంటంటే .....పెళ్లయ్యాక తన సినిమాలు అసలు చూడకూడదని చెప్పిందట. ఈ విషయాన్ని మాధవి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
తన భర్తకి అలాంటి కండిషన్ పెట్టడానికి గల కారణం నా భర్త నన్ను సాధారణ మహిళగానే చూడాలి. ఒకవేళ ఆయన నా సినిమాలు చూస్తే నన్ను ఒక సెలబ్రిటీలాగా చూస్తాడు. నాకు అలా అస్సలు ఇష్టం ఉండదు. నన్ను ఒక సాధారణమైన మనిషిలాగానే నా భర్త చూడాలనే ఉద్దేశంతోనే అతనికి అలాంటి కండిషన్ పెట్టానని మాధవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.