కానీ కొన్ని కొన్ని సార్లు థియేటర్ల వద్ద ఉండే హడావిడిలో ఫ్యాన్స్ చూపించే అత్యుత్సాహం కొన్ని విషాదకరమైన ఘటనలకు కారణం అవుతూ ఉంది. అయితే ఇటీవల అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా విడుదల అయింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా ఎంతటి ప్రభంజన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు సీక్వల్ గా వచ్చిన పుష్ప-2 థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా చూసేందుకు అభిమానులు థియేటర్లకు బారులు తీరారు. ఏ థియేటర్ దగ్గర చూసిన కూడా పండగ వాతావరణం నెలకొంది అని చెప్పాలి. థియేటర్ల వద్ద భారీగా కటౌట్లు ఏర్పాటు చేసి పూజలు కూడా చేస్తూ ఉన్నారు అభిమానులు.
కేవలం సౌత్ లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా పుష్ప సందడి నెలకొన్న నేపథ్యంలో ఒక విషాదకర ఘటన జరిగింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్య థియేటర్ వద్ద రాత్రి జరిగిన తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్ కు చెందిన 39 ఏళ్ల రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమెను బ్రతికించేందుకు పోలీసులు సిపిఆర్ చేసినప్పటికీ కూడా ఫలితం దక్కలేదు.అయితే ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సదరు మహిళ కూతురు ఏడేళ్ల షాన్వి కూడా గాయపడినట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి