ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న వారిలో శంకర్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో దర్శకత్వం వహించిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఈయన తమిళ దర్శకుడు అయినప్పటికీ ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమాను తెలుగులో విడుదల చేశాడు. అందులో భాగంగా ఈయన దర్శకత్వంలో రూపొందిన చాలా సినిమాలు తెలుగులో విడుదల అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం శంకర్ తన స్థాయి సినిమాలను చేయడం లేదు అనే ఓ విమర్శ ఆయనపై ఉంది.

ఆఖరుగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో ఇచ్చిన ఏ సినిమా కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు. దానితో క్రమంగా ఈయన గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. తాజాగా ఈయన రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా విషయంలో శంకర్ తన రూట్ ను పూర్తిగా మార్చినట్లు తెలుస్తోంది. గతంలో శంకర్ దర్శకత్వంలో రూపొందిన చాలా సినిమాలు దాదాపుగా మూడు గంటలు , అంతకుమించిన నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

కానీ గేమ్ చేంజర్ సినిమా మాత్రం కేవలం 2 గంటల 45 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమాను 2 గంటల 45 నిమిషాలతోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు , ఈ సినిమా స్క్రీన్ ప్లే ఫుల్ స్పీడ్ గా ముందుకు దూసుకుపోతుంది అని చెప్పాడు. దానితో శంకర్ సినిమా రన్ టైమ్ విషయంలో తన పాత సినిమాల రూట్ ను వదిలి వేసి గేమ్ చేంజర్ సినిమా విషయంలో కొత్త ఫార్ములా తో ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: