ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో శంకర్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభం నుండి ఏదో ఒక సోషల్ మెసేజ్ ను తన సినిమా ద్వారా ఇస్తూ , దానిని కమర్షియల్ యాంగిల్ లో చూపించడంలో సక్సెస్ అవుతూ వచ్చాడు. ఈయన సినిమా కథల్లో ఎవరు ఊహించని స్టోరీ లేకపోయినా ఈయన అందరికీ తెలిసిన కథనే అద్భుతమైన స్క్రీన్ ప్లే తో చూపించడంలో గొప్ప పేరును సంపాదించుకున్నాడు. దానితో సిస్టమ్ లో జరిగే చిన్న చిన్న లోపాలను ఎంచుకొని వాటిని అద్భుతంగా వెండి ధరపై ఆవిష్కరించి ఎన్నో విజయాలను ఈ దర్శకుడు అందుకున్నాడు.

కానీ ఈ మధ్య కాలంలో మాత్రం శంకర్ తన స్క్రీన్ ప్లే తో ఆ స్థాయి మ్యాజిక్ ను చేయడంలో చాలా వరకు ఫెయిల్యూర్ అవుతూ వస్తున్నాడు. ఇకపోతే సోషల్ మెసేజ్ లను సినిమాల ద్వారా ఇస్తూ ఎన్నో విజయాలను అందుకున్న శంకర్ "రోబో" సినిమా ద్వారా గ్రాఫిక్స్ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఆ తర్వాత ఈయన గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్న సినిమాలను రూపొందించడం పై ఎక్కువ ఆసక్తిని చూపించాడు. కానీ రోబో తర్వాత ఆ ఫార్మేట్ సినిమాలు కూడా ఈయనకు పెద్ద స్థాయిలో సక్సెస్లను ఇవ్వలేదు. దానితో ఈయన తన ఓల్డ్ ఫార్మేట్ లోకి వెళ్లి ఇండియన్ మూవీ కి కొనసాగింపుగా ఇండియన్ 2 అనే సినిమాను రూపొందించాడు.

కానీ ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దానితో ఈ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది. తాజాగా శంకర్ , రామ్ చరణ్ హీరోగా గేమ్ చెంజర్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ కథ శంకర్ ఓల్డ్ సినిమాల కథ మాదిరి గానే ఉంది. కానీ శంకర్ ఓల్డ్ సినిమాలో స్క్రీన్ ప్లే తో ఏ స్తాయి మ్యాజిక్ ను చేశాడో , ఆ మ్యాజిక్ ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో తప్పిస్తే ఎక్కడ కనబడలేదు. దానితో ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ పై మంచి ప్రశంసలు వస్తున్నా ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు లేవు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: