టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో బాలీవుడ్ వైపుగానే ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్లీ తెలుగు, తమిళ భాష పైన ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం సూర్యతో నటించిన రెట్రో సినిమా మే 1వ తేదీన రిలీజ్ కాబోతోంది.ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ తో బజ్ బాగా ఏర్పడింది. ప్రమోషన్స్ లో భాగంగా పూజ హెగ్డే కూడా వరుస ఇంటర్వ్యూలు హాజరవుతున్నారు.


ఈ సమయంలోనే సినిమాకి సంబంధించి పలు విషయాలను తెలియజేసింది. డైరెక్టర్ కార్తీక్ తనను మేకప్ లేకుండా కలవాలని చెప్పడంతో మొదట ఎందుకని అడిగానని.. అలా సహజమైన లుక్కులోనే తనని ఈ సినిమాలో నటింపజేసేలా ప్లాన్ చేస్తున్నారని చెప్పారట. అయితే మొదట అలా చెప్పినప్పుడు ఫీల్ అయ్యానని.. కాని తనకి అలాగే నటించడం చాలా ఇష్టమని తెలియజేసింది పూజా హెగ్డే. అయితే గతంలో పూజా హెగ్డే లుక్స్ పైన చాలా ట్రోల్స్ కూడా వినిపించాయి. కానీ వాటన్నిటినీ కూడా ఈ న్యాచురల్ బ్యూటీతోనే విమర్శకులకు చెక్ పెట్టేలా చేసింది పూజా హెగ్డే.


తనకి రెట్రో సినిమాలో అవకాశం రావడానికి ముఖ్య కారణం రాదే శ్యామ్ సినిమా అని తెలిపింది.. ఈ సినిమాలోని యాక్టింగ్ చూసే డైరెక్టర్ తనని ఎంపిక చేశారని తెలిపింది. తన అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే.. తాను తెలుగులో ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ఆ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే అన్ని విషయాలను కూడా అనౌన్స్మెంట్ చేస్తానని తెలిపింది పూజా హెగ్డే. అలాగే విజయ్ దళపతితో జననాయగన్ సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాబోతోంది. అలాగే రాఘవ లారెన్స్ కాంచన-4 చిత్రంలో కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కూలి సినిమాలో స్పెషల్ సాంగ్లో అలరించబోతోంది పూజా హెగ్డే.

మరింత సమాచారం తెలుసుకోండి: