టాలీవుడ్ లో చాలామంది హీరోలు నిర్మాతలను మోసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలామంది హీరోలు హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది. కనీసం 10 సినిమాలు చేస్తే అందులో రెండు హిట్ సినిమాలు కూడా లేని హీరో రెమ్యునరేషన్ 25 కోట్లు ... వరుస ప్లాపులు ఇస్తున్న మరో హీరో రెమ్యూనరేషన్ 10 కోట్లు. వరుసగా ప్లాపులు వస్తున్న కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ సినిమా ప్లాప్ అయినా కొంత‌ వెనక్కి తిరిగి ఇవ్వకుండా నిర్మాతలను .. బ‌య్య‌ర్లను మోసం చేస్తున్నారు కొందరు హీరోలు. ఒక హీరోకి హిట్టు వచ్చి పదేళ్లు దాటింది .. ఓ ప్రాజెక్టు తనకు కాకుండా వేరే వాళ్లకు చేస్తున్నారని తెలిసి ఓ నిర్మాత వెళ్లి అడిగినంత ఇచ్చి తనే చేస్తా అని ముందుకు వచ్చారు.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో ఉంది.. భారీ నష్టాలతో రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఓ యంగ్‌ హీరో అయితే తన మార్కెట్ ను చాలా ప్లాన్ గా పెంచేశారు .. ఆ హీరోతో సినిమా తీసిన ప్రతి నిర్మాత నష్టపోయారు తప్ప లాభపడలేదు. ఇప్పుడు మూడు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి ఏ ఒక్కటి అమ్ముడు పోవడం లేదు.


కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమాకు అయిన ఖర్చు 16 కోట్లు .. లైలా సినిమాకు పెట్టిన ఖర్చు 25 కోట్లు .. అలాగే ఇటీవల కాలంలో సరైన హిట్ లేని సందీప్ కృష్ణ మజాకా సినిమాకు పెట్టిన ఖర్చు 25 కోట్లు .. ఇక సిద్దు జొన్నలగడ్డ జాక్ సినిమాకు ఆయన ఖర్చు 40 కోట్లు ... ఆ సినిమా కనీసం రెండు కోట్లు షేర్ కూడా రాలేదు. ఇక కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు 40 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకోలేక భారీ నష్టాలు మిగిలిచేలా కనిపిస్తోంది. ఇక తమన్నా ప్రధానోపాత్రలో వచ్చిన ఓదెల టు సినిమాకు పెట్టిన ఖర్చు 25 కోట్లు .ఇలా చిన్న చిన్న సినిమాలకు కూడా నిర్మాణం భారీగా పెరుగుతుంది.


ఇందులో అధిక భాగం హీరోలకు ఆపై కొంతవరకు దర్శకులకు రెమ్యునరేషన్ గా వెళుతోంది. అక్కడితో ఆగటం లేదు కొందరు పెద్ద పెద్ద సినిమాటోగ్రాఫర్లను డిమాండ్ చేస్తున్నారు .. వాళ్లకు కూడా భారీగా ఇవ్వాల్సి వస్తోంది. చాలామంది నిర్మాతలు ఖాళీగా ఉండలేక ఏదో ఒక ప్రాజెక్టు ఎక్కించాల్సిందే అనుకుని ఏళ్ల తరబడి వరుసగా ప్లాపులు ఇస్తున్న హీరోలతో సినిమాలు తీస్తూ వారిని బతికిస్తూని బతికిస్తూ తాము చేతులు కాల్చుకుంటున్నారు. మరోవైపు సినిమాలు ప్లాప్ అవుతుంటే సమీక్షకులను తిడుతున్నారు. హిట్ ఇచ్చిన హీరోల వెంట పడుతున్నారు అంటే అర్థం ఉంది .. ఏళ్ల తరబడి డిజాస్టర్ ఇస్తున్న హీరోల వెంట ఎందుకు ప‌డతారో వారికి అర్థం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: