నాని ఈ మధ్య కాలంలో వరుస పెట్టి విజయాలను అందుకుంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితం నాని "దసరా" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. నాని ఆ తర్వాత హాయ్ నాన్న , సరిపోదా శనివారం సినిమాలతో కూడా మంచి విజయాలను అందుకున్నాడు. ఇలా వరుసగా మూడు విజయాలను అందుకొని నాని ప్రస్తుతం అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే తాజాగా నాని , శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. శ్రీ నిధి శెట్టి ఈ మూవీ లో నాని కి జోడిగా నటించింది.

మూవీ ని మే 1 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ను కూడా కొన్ని ప్రాంతాలలో ఓపెన్ చేశారు. ఇక నాని హీరో గా రూపొందిన ఆఖరి మూడు సినిమాలు మంచి విజయాలను సాధించడం , అలాగే హిట్ ది ఫస్ట్ కేస్ , హిట్ ది సెకండ్ కేస్ మూవీలు కూడా మంచి విజయాలను సాధించి ఉండడంతో హిట్ ది థర్డ్ కేస్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

దానితో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ విడుదలకు ఇంకా చాలా రోజుల మిగిలి ఉండగానే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ మూవీ కి ఏకంగా 2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కినట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ కి అడ్వాన్స్ బుకింగ్ల ద్వారానే అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: