టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ పూజా హెగ్డే. ప్రస్తుతం పూజా రెట్రో మూవీలో నటిస్తుంది. ఈ మూవీలో హీరోగా తమిళ నటుడు సూర్య నటిస్తున్నారు. రెట్రో సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ యాక్షన్ సినిమా వచ్చే నెల 1న విడుదల కానుంది. అయితే ఇటీవలే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు జరిగాయి. ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ వచ్చాడు. ఈ ఈవెంట్ కి అందాల భామ పూజా హెగ్డే హాజరు కాలేదు. ఈవెంట్ లో హీరో సూర్య మాట్లాడుతూ.. తనకంటే కూడా పూజా హెగ్డేనే రెట్రో మూవీని కాస్త ఎక్కువగా ప్రమోట్ చేస్తుందని చెప్పుకొచ్చాడు. అయితే ఇలాంటిదే ఏదో పని ఉండే తను ఈవెంట్ కి రాలేకపోయిందని అనుకుంటున్నట్లు సూర్య చెప్పుకొచ్చారు.
 
కానీ పూజా రాకపోవడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. ప్రతి ఈవెంట్ ని సితార నాగ వంశీ చూసుకుంటున్నాడని అందువల్లే పూజ వీటికి కాస్త దూరంగా ఉంటుందని తెలుస్తోంది. గుంటూరు కారం సినిమాలో మొదట హీరోయిన్ గా పూజ హెగ్డే అనుకొని తర్వాత శ్రీలీలని మెయిన్ లీడ్ గా మార్చిన విషయం తెలిసిందే. అందుకే ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఈవెంట్ కి రాలేదేమోనని వార్తలు వస్తున్నాయి.    

పూజా హెగ్డే మోడల్, నటి. ఈ బ్యూటీ అందం గురించి మాట్లాడుకోవాల్సిన పనిలేదు. ఎంతైనా మిస్ యూనివర్స్ కదా. ఈమె 2014 లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. తరువాత ఒక లైలా కోసం సినిమాలో నటించింది. 2016 లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మొహంజదారో సినిమాలో నటించింది. ఆతర్వాత పూజ రాధేశ్యామ్‌‌, బ్యాచిలర్, దువ్వాడ జగన్నాధం సినిమాలలో కూడా నటించింది.  పూజా హెగ్డే సౌత్ లో చాలా సినిమాలు చేసినప్పటికీ మంచి ఫలితం రాలేదు. ఆమెకు వరుసగా ఫ్లాపులు రావడంతో మేకర్లు లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో నార్త్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఈ అందాల భామ నార్త్ లో సినిమాలు చేస్తుంది. రెట్రోతో పాటుగా ఈమె కూలీ, కాంచన 4 సినిమాలలో కూడా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: