పుష్ప ది రూల్ మూవీ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ అనే బాలుడు గాయాలపాలు కాగా తాజాగా ఆ బాలుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ బాలుడు పూర్తిస్థాయిలో కోలుకోలేదని తెలుస్తోంది. శ్రీతేజ్ కేవలం కళ్లు తెరుస్తున్నాడని మనుషులను గుర్తు పట్టే విషయంలో శ్రీతేజ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నడని సమాచారం అందుతోంది. ప్రస్తుతం శ్రీతేజ్ నోటి ద్వారా ఫుడ్ తీసుకుంటున్నారని భోగట్టా.
 
న్యూరో రీహాబిటేషన్ సెంటర్ లో శ్రీతేజ్ 15 రోజుల పాటు ఉండనున్నట్టు సమాచారం అందుతోంది. శ్రీతేజ్ 15 రోజుల తర్వాత ఇంటికి వెళ్లనున్నారని సమాచారం అందుతోంది. శ్రీతేజ్ బ్రెయిన్ ఇంకా పూర్తిస్థాయిలో రికవరీ కావాల్సి ఉందని భోగట్టా. శ్రీతేజ్ కు ఫిజియో థెరపీ, స్పీచ్ థెరపీ ఇప్పించనున్నారని సమాచారం. రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉంచడం ద్వరా శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడే ఛాన్స్ ఉంది.
 
శ్రీతేజ్ విషయంలో రాబోయే రోజుల్లో మరింత కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. శ్రీతేజ్ కు తల్లి మరణించిందనే విషయం తెలిస్తే మరింత షాక్ కు గురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. శ్రీతేజ్ పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలియల్సి ఉంది.
 
బన్నీ కుటుంబం నుంచి శ్రీతేజ్ కు ఆర్థిక సహాయం అందుతుందేమో చూడాల్సి ఉంది. దాదాపుగా 5 నెలల పాటు శ్రీతేజ్ కు చికిత్స జరిగింది. పుష్ప మూవీ టీం, తెలంగాణ ప్రభుత్వం, మీడియా నుంచి భారీ స్థాయిలో సపోర్ట్ లభించిందని సమాచారం అందుతోంది. బన్నీ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. బన్నీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.






మరింత సమాచారం తెలుసుకోండి: