స్టార్ హీరో అజిత్ గాయాలయ్యాయి. ఇటీవల అజిత్ పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు. అనంతరం ఆయన ఢిల్లీ నుంచి చెన్నై ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు. అక్కడ ఆయన అభిమానులు ఆయనను కలిసే సమయంలో గందరగోళం ఏర్పడి కాలికి స్వల్ప గాయమైనట్టు టీమ్ వెల్లడించింది. వెంటనే నటుడు అజిత్ ను చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. తాజాగా అజిత్ కి ప్రమాదం ఏమీ లేదని డాక్టర్స్ స్పష్టం చేసినట్టు టీమ్ తెలిపింది. నేడు సాయంత్రం హీరో అజిత్ ని డిస్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక అజిత్ కి ఎలాంటి ప్రమాదం లేదన్న వార్త విన్న అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

అజిత్ తెలుగుతో పాటు తమిళం, కనడ, మలయాళం, ఆంగ్ల భాషలను కూడా మాట్లాడగలడు. ఈయన నటన మాత్రం ఎంతో సహజంగా ఉంటుంది. ఆయన ఏ పాత్ర పోషించిన దానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతారు అంతే. హీరో అజిత్ ఇప్పటికే 61 పైగా చిత్రాలలో నటించారు. ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళం సినిమాలలో అజిత్ ఎక్కువగా నటిస్తారు. పాత్ర ఎలాంటిది అయిన సరే ఆయనకి నచ్చితే చాలు చేసేస్తారు. అజిత్ ప్రేమ పుస్తకం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. నటుడు అజిత్, నటి షాలినిని వివాహం చేసుకున్నాడు.

 
స్టార్ హీరో అజిత్, త్రిష నటించిన 'పట్టుదల' సినిమా సందడి చేసింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విడుదల అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఒక యాక్షన్ కామిడీ మూవీ. ఈ సినిమాలో అజిత్ లుక్స్ మామూలుగా లేవు.. దీంతో ప్రేక్షకులకు ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అంచనాలకు తగట్టుగానే సినిమాను తెరపైకి తీసుకొచ్చారు. ఇక నటుడు అజిత్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. 















మరింత సమాచారం తెలుసుకోండి: