
అలాంటివారిలో శ్రీలీల కూడా ఒకరు. స్పెషల్ సాంగ్ కు భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటూ ఒకవైపు హీరోయిన్ గా కూడా దూసుకుపోతోంది. ఇప్పటికే శ్రీలీల డ్యాన్స్ కి సైతం ఫిదా అయిన అభిమానులు పుష్ప 2 సినిమాలో కిసికి సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో క్రేజ్ పెరగడంతో ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు టాలీవుడ్ లో మరొకసారి ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది. అదేమిటంటే రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలో స్పెషల్ సాంగ్లో శ్రీ లీల కనిపించే అవకాశం ఉన్నట్లు టాకు వినిపిస్తోంది.
డైరెక్టర్ బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా భారీ బడ్జెట్ తో నిర్మించగా.. హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ తో పాటు జగపతిబాబు తదితరనటి నటులు ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండగా.. స్పెషల్ సాంగ్ కోసం డైరెక్టర్ బుచ్చిబాబు శ్రీలీలని ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫుల్ ఎనర్జిటిక్ గా సాగే మాస్ సాంగ్లు రామ్ చరణ్, శ్రీ లీల కలిసి స్టెప్పులు వేయబోతున్నారని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇక అభిమానులకు ఫుల్ పండగే అని కూడా చెప్పవచ్చు.