టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి పూజా హెగ్డే ఒకరు. ఈ భామ చిత్ర పరిశ్రమకు ఒక లైలా కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంది. ఆ సినిమా అనంతరం తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. అలా వైకుంఠపురం సినిమాలో ఈ చిన్నదాని నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను బుట్ట బొమ్మగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

 ఈ సినిమా అనంతరం ఈ చిన్నదానికి వరుసగా సినిమా అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ ఎక్కువగా ఎలాంటి సినిమాలలో అవకాశాలు లేక చిత్ర పరిశ్రమకు కాస్త దూరమైంది. ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే హీరోయిన్ గా నటించింది. కానీ ఆ సినిమాలేవి పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయి. ఇక ఈ భామ తెలుగుతో పాటు హిందీలోనూ అనేక సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందుతోంది. ఇదిలా ఉండగా.... పూజ హెగ్డేకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. పూజ హెగ్డే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.

 తనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోను, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతాయి. ఈ చిన్న దానికి సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓ స్టార్ హీరోతో ఎఫైర్ ఉన్నట్లుగా అనేక రకాల వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అది కూడా తమిళ హీరోతో అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఆ హీరోను వివాహం చేసుకోవాలని కూడా పూజా హెగ్డే నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తోంది. పూజా హెగ్డే వివాహానికి కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. చాలా కాలం పాటు సీక్రెట్ గా ప్రేమాయణం కొనసాగిస్తున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ విషయం పైన పూజ హెగ్డే ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం వెలుగులోకి రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: