టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువి క్రియేషన్స్ బ్యానర్లో మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో త్రిష హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే చిరంజీవి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

సినిమా షూటింగ్ను మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభించాలి అనే ఉద్దేశంలో ఈ మూవీ బృందం ఉండడంతో ఈ సినిమాలో చిరంజీవి పక్కన ఎవరు హీరోయిన్గా ఉండాలి అనే దానిపై ఈ మూవీ యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కేథరిన్ ను హీరోయిన్ గా తీసుకోవాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ బృందం క్యాథరిన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు , ఇక కేథరిన్ కూడా చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ అవకాశం దక్కడంతో వెంటనే ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఒక వేళ నిజం గానే క్యాథరిన్ కు చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కినట్లయితే ఇది ఆమె కెరియర్ కు అదిరిపోయే రేంజ్ ఆఫర్ అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి నిజం గానే చిరు , అనిల్ కాంబో మూవీ లో క్యాథరిన్ హీరోయిన్గా సెలెక్ట్ అయిందా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: