టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కుమారుడు అయినటువంటి అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ అనే మూవీ తో హీరో గా పరిచయం అయ్యాడు . మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన కూడా ఈ సినిమాలో అఖిల్ తన నటనతో , డాన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

దానితో ఈయనకు నటుడిగా మంచి గుర్తింపు ఈ సినిమా ద్వారా దక్కింది. ఇకపోతే ఈయన ఇప్పటి వరకు చాలా మూవీ లలో హీరో గా నటించిన ఈయనకు అత్యంత భారీ విజయం మాత్రం ఇప్పటి వరకు దక్కలేదు. ఆఖరుగా అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఏజెంట్ మూవీ తర్వాత కాస్త ఎక్కువ కాలం గ్యాప్ తీసుకున్న అఖిల్ కొంత కాలం క్రితం లెనిన్ అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం అత్యంత వేగంగా జరుగుతుంది.

మూవీ బృందం వారు మరికొన్ని రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే ఈ మూవీ బృందం వారు అన్నపూర్ణ స్టూడియోలో ఒక భారీ సెట్ ను కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. మరి ఇప్పటికే చాలా అపజయాలను ఎదుర్కొన్న అఖిల్ "లెనిన్" మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: