మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నా కూడా మంచి విజయాలు మాత్రం దక్కడం లేదు. ఈ మధ్య కాలంలో రవితేజ నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఆఖరుగా రవితేజకు "ధమాకా" సినిమా తో మంచి విజయం దక్కింది. ఆ తర్వాత ఈయనకు ఏ సినిమా ద్వారా కూడా విజయం దక్కలేదు. ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ తర్వాత రవితేజ , కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ప్రస్తుతం కిషోర్ తిరుమల , రవితేజ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కిషోర్ తిరుమల , రవితేజ తో తెరకెక్కించబోయే సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కు విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు తగినట్లుగానే ఈ సినిమా పనులన్నీ పూర్తి చేయాలి అనే ఆలోచనలో మూవీ బృందం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పట్లో రవితేజ , కిషోర్ తిరుమల సినిమాకు సంబంధించిన అప్డేట్ ఉండే అవకాశాలు లేవు అని తెలుస్తుంది.

మాస్ జాతర సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక కిషోర్ తిరుమల తన సినిమాకు రవితేజ లుక్ సంబంధించి ఒక టెస్టును నిర్వహించనున్నట్లు , అది ఓకే అయిన తర్వాత ఒక వీడియోను రూపొందించి దానితో ఆ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇవ్వాలి అని ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు దానికి చాలా టైమ్ పట్టే ఛాన్స్ ఉండడంతో ఇప్పట్లో రవితేజ , కిషోర్ తిరుమల కాంబో మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ రాదు అని ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt