
అయితే మనం సినిమా తర్వాత నాగార్జున - నాగచైతన్య - అఖిల్ కలిసి ఒక సినిమాలో నటించాల్సి ఉండింది . కానీ కొన్ని కారణాల చేత ఆ సినిమా నుండి అఖిల్ తప్పుకున్నాడు . కేవలం నాగచైతన్య నాగార్జున మాత్రమే నటించారు . ఇప్పటికే ఆ సినిమా ఏంటో మీకు అర్థమైపోయింది అనుకుంటాను . ఎస్ "బంగార్రాజు". ఈ సినిమాలో నాగచైతన్య - నాగార్జున కలిసి నటించారు . నిజానికి అఖిల్ కూడా ఈ సినిమా నటించాలంట . కానీ క్యారెక్టర్ పరంగా అఖిల్ పాత్ర యాడ్ చేసినట్లు ఉంటుంది అని ఈ సినిమాకి ఇద్దరు హీరోలు ఉంటేనే బాగుంటుంది అని డైరెక్టర్ సజెస్ట్ చేయడంతో అఖిల్ పాత్రను ఈ సినిమా నుంచి తీసేసారట .
అసలు దైరెక్టర్ ఇద్దరి హీరోలతోనే ఈ సినిమాని రాసుకున్నాడట. కానీ నాగార్జున నే ఈ సినిమాలో అఖిల్ ని కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ..డైరెక్టర్ కి ఎక్స్ట్రా క్యారెక్టర్ రాయించారట. కానీ డైరెక్టర్ ఆ క్యారెక్టర్ రాసుకున్న..సినిమాలో యాడ్ చేయడానికి ఇష్టపడలేదు. ఒకవేళ అన్ని సెట్ అయి ఉంటే మాత్రం మనం సినిమా తర్వాత నాగచైతన్య - నాగార్జున- అఖిల్ ఈ సినిమాలో నటించి మెప్పించి ఉండేవారు. జస్ట్ మిస్..!