
కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం బాలయ్య మరోసారి తన ఫేవరెట్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది . బోయపాటి శ్రీను తర్వాత బాలయ్యకు అంత ఇష్టమైన డైరెక్టర్ క్రిష్ . ఇది ఎన్నో సార్లు బాలయ్య బయట పెట్టాడు . కాగా వీళ్ళ కాంబోలో ఆల్రెడీ గౌతమీపుత్ర శాతకర్ణి.. కథానాయకుడు సినిమాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబోలో సినిమా రాబోతుంది . ఆదిత్య 999 అనే సినిమాను బాలయ్యతో తెరకెక్కించబోతున్నాడట క్రిష్ . అంతేకాదు ఈ సినిమా ద్వారానే మోక్షజ్ఞ డెబ్యు కూడా ప్లాన్ చేశారట .
మోక్షజ్ఞ డెబ్యూ ని ఎవరు ప్లాన్ చేస్తున్న ఆగిపోతుంది. అందుకే టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కి ఈ బాధ్యతలు అప్పగించాడట బాలయ్య. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. బాలయ్య - మోక్షజ్ఞ - క్రిష్..ఇది క్రేజీ కాంబో . ఈ సినిమా హిట్ అయితే ఇక క్రిష్ లెవెల్ వేరే రేంజ్ లో ఉండబోతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్నం సినిమాలో ఆమె పర్ ఫామెన్స్ చూసి అందరు ఫిదా అయిపోయారు..!