ఈ మధ్యకాలంలో ప్రేమ అనేది కేవలం ఒక మాటగానే మిగిలిపోతుంది. ప్రేమ అనే పేరుతో ఏవేవో కోరికలు తీర్చేసుకుని .. ఆ తర్వాత మా మధ్య బాండింగ్ కుదరడం లేదు అంటూ బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు . కొంతమంది ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లి ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకుంటే మరి కొందరు ప్రేమను ప్రేమ స్టేజ్ లోనే బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు.  రీసెంట్గా స్టార్ హీరో చేసిన ఘనకార్యం ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే అందరి ప్రముఖులకి ముక్కున వేలు వేసుకునేలా చేసింది . చాలా చాలా పెద్ద స్టార్ హీరో ఈయన. అసలు  ఇతగాడి లాంటి మంచి హీరో ఇంకొకడు ఉంటాడా..? అనే రేంజ్ లో చాలామంది ఇతగాడిని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి అంటూ పలువురు కుర్రాళ్ళకి నీతి వ్యాఖ్యలు చేసే వాళ్ళు .


సీన్ కట్ చేస్తే ఆ హీరో తన భార్యకు విడాకులు ఇచ్చేసాడు . ఎవ్వరు ఊహించని విధంగా అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోయారు . ఇంకా వీళ్ళు విడాకులకు సంబంధించి కోర్ట్ నోటీసులు కూడా ఇవ్వలేదు. వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నామంటూ మాత్రమే సోషల్ మీడియా వేదికగా  ప్రకటించాడు . అయితే ప్రకటించి సరిగ్గా ఆరు నెలలు నిండిన తర్వాత వెంటనే మరొక సింగర్ తో చట్టపట్టలేసుకొని తిరిగేస్తున్నాడు ఈ స్టార్ హీరో . ఆల్రెడీ వీళ్లిద్దరి రిలేషన్ మీడియాలో వార్తలు వస్తే పెద్ద నీతిమంతుడిలా ఫుల్ ఫైర్ అయిపోయాడు .



"ఛీ ఛీ నేను అలాంటి వాడిని కాదు ..ఆమెకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఎందుకు ఇలా చేస్తున్నారు..??" అంటూ చాలా చాలా నిజాయితీపరుడుగా మాట్లాడారు . ఇప్పుడు మాత్రం ఓ ఫంక్షన్ కి స్టార్ సింగర్ ని వెంటపెట్టుకొని వెళ్లి అందరికీ కొత్త డౌట్లు క్రియేట్ చేశాడు . ఏదో వెంటపెట్టుకొని వెళ్తే వెళ్ళాడు క్లోజ్ గా ఎందుకు మూవ్ అవ్వాలి ..? చేతిలో చేయి వేసుకొని  అంత దగ్గరికి లాక్కొని ఫోటోకి ఫోజులిస్తే ఎవరైనా ఏమనుకుంటారు ..? వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉండనే ఉంటుంది అని అనుకుంటారు. ప్రజెంట్ ఈ హీరో పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కి గురవుతుంది . అంతే కాదు కొంతమంది పచ్చిగా కూడా ఈ హీరో పై ఘాటుగా వ్యాఖ్యలు కామెంట్స్ పెడుతున్నారు . భార్య దగ్గర నుంచి విడాకులు తీసుకున్న ఆరు నెలలకే నీ మీటర్ స్ట్రాంగ్ అయ్యిందా..? అంటూ పిచ్చి పిచ్చి పదాజాలంతో దూషిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ హీరో చేసిన ఘనకార్యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: