గత కొద్ది రోజుల నుండి అక్కినేని నాగేశ్వర రావు మనవడు సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఎప్పుడైతే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో ఉన్న ఫోటో బయట పడిందో ఆ ఫోటో వైరల్ అయిన సమయం నుండి మృణాల్ ఠాకూర్ కి సుమంత్ కి మధ్య ఏదో నడుస్తోందని, వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే ప్రచారం నడుస్తోంది. ఇందులో భాగంగా మృణాల్ ఠాకూర్ సుమంత్ లు రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలపై తాజాగా స్పందించారు సుమంత్. .ఆయన ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. నేను హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ని పెళ్లి చేసుకుంటున్నాను అంటూ వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదు.

 ప్రస్తుతం నాకు రెండో పెళ్లి పై అంతగా నమ్మకం లేదు. ఇంట్రెస్ట్ కూడా లేదు.. నేను ఒంటరిగా సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను. సింగిల్గానే ఉండాలి అనిపిస్తుంది. ప్రస్తుతం సినిమాలు ఎక్కువగా చేయట్లేదు. అలాగే సినిమాల వల్లే ఫేమస్ అవుతాం అని కాదు. నాకు ఉన్న ఆస్తిపాస్తులను కాపాడుకోవడం నా బాధ్యత. అలాగే నేను ఎవరిని పెళ్లి చేసుకోవడం లేదు. సోషల్ మీడియా కి నేను దూరంగా ఉంటాను.

 కాబట్టి సోషల్ మీడియా లో ఏం వైరల్ అవుతుందో కూడా నేను పట్టించుకోలేదు.. సినిమా లు ప్రొడ్యూస్ చేసే విషయం లో కూడా నాకు అంత గా ఆసక్తి లేదు. నా దగ్గరికి వచ్చిన సినిమాలనే నేను ఓకే చేస్తున్నాను. సినిమాలు చేయక పోతే ప్రేక్షకులు ఆదరించరు అనే భయం కూడా నాలో లేదు అంటూ రెండో పెళ్లి విషయం పై క్లారిటీ ఇచ్చారు సుమంత్. ప్రస్తుతం సుమంత్ క్లారిటీ తో మృణాల్ ఠాకూర్ తో పెళ్లి వార్తలకు చెక్ పడింది..

మరింత సమాచారం తెలుసుకోండి: