
హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే గబ్బర్ సింగ్ అందరికీ గుర్తు వస్తుంది .. ఈ సినిమా లో ఎంటర్టైన్మెంట్ పంచ్ డైలాగులు బాగా గుర్తుకొస్తాయి వీటితో పాటు హీరో ఎలివేషన్ కూడా .. అయితే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఇవే ఉంటాయని అందరూ భావించడం ఎంతో కామన్ .. అయితే ఇప్పుడు వీటి విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పరిమితి విధించారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి . ఆంధ్రప్రదేశ్‌కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. సనాతన ధర్మాన్ని గట్టిగా నమ్ముతూ ప్రబోధిస్తున్నారు . ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే సినిమా డైలాగులు అన్ని ఉండాలని చెప్పినట్టు తెలుస్తుంది రెగ్యులర్గా సినిమాల్లో ఉండే సదాశివ కామెడీ కానీ మరి హీరో ఎలివేట్ చేసే పంచ్ డైలాగ్ లు కానీ వద్దు అని కూడా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి ..
ఇక ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ స్క్రిప్ట్ డైలాగ్స్ ను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది .. ఇక వచ్చే జూన్ రెండో వారంలో సినిమా స్టేట్స్ మీదకు పవర్ స్టార్ వస్తారని టాక్ కూడా ఉంది .. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్ మీద ఇదంతా ఆధారపడి ఉంటుంది . ఇప్పటికే రిలీజ్ డేట్ రెండు మూడు సార్లు వాయిదా పడిన హరి హర వీరమోల్లు పరిస్థితి అందరికీ తెలిసిందే .. సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు రోజుల షూటింగ్ బ్యాలెన్స్ మాత్రమే ఉంది కానీ ఆయన పొలిటికల్ బిజీ షెడ్యూల్లో భాగంగా సినిమా కు డేట్లు ఇవ్వలేకపోతున్నారు . ఈ క్రమంలో ఉస్తాద్‌ను పవన్ ఏ విధంగా పూర్తి చేస్తారు అనే దానిపై కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా చర్చ నడుస్తుంది ..