
ఈమూవీకి సంబంధించి లేటెస్ట్ గా విడుదల చేసిన ‘కిస్సాక్ 47’ లిరికల్ సాంగ్ లో గోవిందా నామాలను రీమిక్స్ చేయడం ఆధ్యాత్మిక వాదులకు ముఖ్యంగా శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు తీవ్ర మనోవేదన కలిగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అనేక ప్రముఖ రాజకీయ పార్టీలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ పాట పవిత్రమైన ఏడుకొండల వేంకటేశ్వర స్వామి స్తోత్రాన్ని అపవిత్రం చేసింది అంటూ కొందరు కార్య కర్తలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నాట్లుగా వార్తలు కూడ వస్తున్నాయి.
ఈ వివాదం పై సంతానం స్పందిస్తూ తాము దేవుడిని అవమానించలేదని ఈపాటకు సెన్సార్ కూడ ఓకే చెప్పిందని అని అనడంతో ఈ వివాదం మరింత ముదిరిపోయి ఈసినిమాను బ్యాన్ చేయమాని కొందరు లేదంటే ఈసినిమాలో ఆపాటను తీసివేయమని మరికొందరు ఉద్యమాలు చేస్తూ ఉండటంతో ప్రస్తుత వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈసినిమా డబ్బింగ్ వర్షన్ తెలుగులో కూడ విడుదల కాబోతోంది. దీనితో ఈవివాదం నుండి ఈమూవీ నిర్మాతలు ఎలా బయటపడతారు అన్న విషయం పై అందరిలోనూ ఆశక్తి ఉంది.
వాస్తవానికి గోవిందా నామాన్ని రీమిక్స్ చేయడం ఏ కోణంలో చూసినా పొరపాటే అవుతుంది. క్రియేటివిటీ పేరుతో భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా ఇలాంటి ప్రయోగాలు చేయడం మంచిదికాదు. ఈ పాటను ఇప్పటివరకు లక్షలాది మంది విన్నారు అంటే ఈ వివాదం ఈసినిమాకు ఎలాంటి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చి పెట్టిందో అర్థం అవుతుంది. మరి ప్రేక్షకులు ఈ డబ్బింగ్ సినిమాను ఎంతవరకు పట్టించుకుంటారు అన్నది ఈవారంతేలిపోతుంది అనుకోవాలి