\అన్ని మనం అనుకున్నట్లు జరిగితే అది లైఫ్ అని అనిపించుకోదు.  కొన్ని కొన్ని సార్లు మనం ఎక్స్పెక్ట్ చేయనవి  కూడా జరుగుతూ ఉంటాయి . అలాంటి సిచువేషన్ నుంచి చాలా చాకచక్యంగా తప్పించుకుంటే లైఫ్ లో మనం అనుకున్న గోల్ ని రీచ్ అవ్వచ్చు.  లేదు రాంగ్ డెసిషన్ తీసుకుంటే మాత్రం మళ్లీ డౌన్ ఫాల్ అవ్వాల్సిందే . ప్రజెంట్ ఇలాంటి ఒక అయోమయ సిచువేషన్ లో పడిపోయాడు హీరో నాగ చైతన్య . తండేల్  సినిమాతో హిట్ కొట్టాడు . 100 కోట్ల క్లబ్ లోకి చేరాడు అక్కినేని హీరో అనిపించుకున్నాడు. ఇంకేముంది అక్కినేని నాగచైతన్యకు తిరుగులేదు నెక్స్ట్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ లాంటి హిట్ అందుకున్న డైరెక్టర్ కార్తీక్ వర్మ దండుతో సినిమా అంటే మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్.. ఓన్లీ క్లాప్స్. ఇలా ఓ రేంజ్ లో నాగచైతన్య ని పొగిడేస్తారు జనాలు . 


సీన్ కట్ చేస్తే ఇప్పుడు నాగచైతన్యకి మరో బిగ్ హెడేక్ తెప్పించే సిచువేషన్ వచ్చేసింది . నిజానికి కార్తీక్ వర్మ దండు ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే అని అనుకున్నారు అంటూ ఎప్పటినుంచో టాక్ వినిపించింది.  రెట్రో లో సినిమా కన్నా ముందే ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే అని అనుకున్నారట . అయితే రెట్రో సినిమా ప్లాప్ అయ్యాక ఇప్పుడు నాగార్జున ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే వద్దు అంటూ కార్తీక్ వర్మకు తేల్చి చెప్పేసాడట.  అంతేకాదు నేషనల్ క్రష్  రష్మిక మందన్నా.. అయితే ఈ సినిమాకి బాగుంటుంది అంటూ కూడా సజెస్ట్ చేశారట .



రష్మిక ఈ ప్రాజెక్టును ఓకే చేస్తుంది అన్న కాన్ఫిడెంట్ తో కార్తీక్ వర్మ... పూజ హెగ్డే ని రిజెక్ట్ చేశారు.  ఆశ్చర్యమేంటంటే రష్మిక మందన్నా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీయెస్ట్ హీరోయిన్ . నాగచైతన్య ఒకటో రెండో హిట్స్ అందుకున్నాడు . నాగచైతన్య సినిమాలో నేను చేయను కాల్ షీట్స్ లేవు అంటూ రష్మిక మందన్నా  రిజెక్ట్ చేసిందట. ఈ ఇయర్ కాల్ షీట్స్ లేవు అంటూ చిన్న డైరెక్టర్స్ ను రిజెక్ట్ చేస్తుందట రష్మిక. ఇప్పుడు నాగచైతన్యకు కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది .



అటు నాగార్జున మాట కాదనలేక పూజ హెగ్డే ని సినిమా లో నుంచి తీసేశారు . అదేవిధంగా రష్మిక ఈ సినిమాని ఓకే చేస్తుంది అంటూ అశలు పెట్టుకుంటే ఆమె రిజెక్ట్ చేసింది . ఈ నాగచైతన్య పక్కన హీరోయిన్గా ఎవరు సూట్ అవుతారు..? ఈ క్యారెక్టర్ కి ఎవరు ఇప్పుడు సెట్ అవుతారు..? అని ఫుల్ మేకర్స్ టెన్షన్ పడిపోతున్నారట.  నాగచైతన్య పక్కన హీరోయిన్ గా నటించడానికి స్టార్ హీరోయిన్స్ అయితే యాక్సెప్ట్ చేయరు. కొంచెం నాగచైతన్య పై సోషల్ మీడియాలో నెగిటివిటీ ఉంది . సమంతకు సంబంధించిన హీరోయిన్స్ అయితే అసలు నాగచైతన్య సినిమాని అస్సలు ఓకే చేయరు. ఇప్పుడు ఈ హీరో పరిస్థితి ఏంటి..? అంటూ జనాలు దారుణంగా కౌంటర్స్ వేస్తున్నారు.  అంతేకాదు "ఉన్నది పోయే ఉంచుకున్నది పాయే "అన్న సామెతని సెటైరికల్ గా కౌంటర్స్ వేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: