సాధారణంగా డబ్బున్న స్టార్ సెలబ్రిటీస్ తమ డ్రైవర్లతో తమ పని వాళ్ళతో అంత చనువుగా ఉండరు . తమ రేంజ్ ఇది అంటూ బీహేవ్  చేస్తూ ఉంటారు . సినిమా ఇండస్ట్రీలో ఉండే జనాలు కూడా అంతే.  మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో - హీరోయిన్స్ తమ దగ్గర వర్క్ చేసేవాళ్లను ఎక్కువగా దగ్గరకి తీయరు . ఎవరో ఇద్దరో ముగ్గురో స్టార్స్ మాత్రమే వాళ్ళతో క్లోజ్ గా మాట్లాడి.. వాళ్ళ బాగోగులు తెలుసుకుంటూ ఉంటారు . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య అక్కినేని శోభిత కి సంబంధించిన వార్త ఇంట్రెస్టింగ్ గా మారింది. 


రీసెంట్ గానే వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  అన్నపూర్ణ స్టూడియోస్ లో ..ఏఎన్ఆర్ విగ్రహం వద్ద వీళ్ల పెళ్లి చాలా చాలా సింపుల్ గా జరిగింది . ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు నాగచైతన్య - శోభిత.  రీసెంట్ గానే శోభిత ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ అదంతా ఫేక్ అంటూ శోభిత ధూళిపాళ్ళ టీం ప్రకటించింది . మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ట్రెండింగ్ లోకి వచ్చింది . నిజానికి నాగచైతన్య తన వర్కర్ ల తో ఇంట్లో పనిచేసే వాళ్ళతో అదే విధంగా తన కార్ డ్రైవర్ తో అంత చనువుగా ఏమి మూవ్ అవ్వరట.



ఏదైనా డబ్బులు కావాలి అన్నప్పుడు ఇస్తూ ఉంటారు తప్పిస్తే మిగతా విషయాలు పెద్దగా పట్టించుకోరట. కానీ శోభిత మాత్రం అలా కానేకాదు.  శోభిత  అక్కినేని ఫ్యామిలీకి దగ్గరై చాలా తక్కువ టైం.. అయినా అక్కినేని ఫ్యామిలీ ఇంట్లో వర్క్ చేసే వాళ్ళతో బాగా క్లోజ్ గా మింగిల్ అయిపోయిందట . వాళ్ల బాగోగులు తెలుసుకోవడం.. వాళ్ళ పిల్లలు చదువులు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడం ఎక్కువగా వాళ్లకు కావాల్సిన సదుపాయాలను తెలుసుకొని వాళ్లకి చేస్తూ ఉంటుందట . నిజానికి నాగచైతన్య ఇలా ఎప్పుడు చేయలేదట . నాగార్జున కూడా పెద్దగా ఈ విషయాలను పట్టించుకోడట.  కానీ శోభిత ధూళిపాల మాత్రం చాలా చాలా డౌన్ టూ ఎర్త్ మనిషి  అని ఆ కారణంగానే ఇలా తన ఇంట్లో వర్క్ చేసే పని వాళ్ళతో కూడా ఇంత క్లోజ్ గా మింగిల్ అవుతూ ఉంటుందని .. గతంలో సమంత కూడా ఇదే విధంగా చేసి వాళ్ళ ప్రేమాభిమానాలు పొందింది. ఇప్పుడు శొభిత కూడా కూడా అదే పని చేస్తుంది అని అక్కినేని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. పెళ్ళి తరువాత శోభిత సినిమాల్లో నటిస్తుంది.  ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో భాగమైంది..ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: